తెలంగాణ పార్లమెంట్ స్థానాల్లో మరో ఐదింటికి జనసేన పార్లమెంటరీ కమిటీలను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నియమించారు. చేవెళ్ల, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, పెద్దపల్లి, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో జనసేన ఎగ్జిక్యూటివ్‌, వర్కింగ్‌ కమిటీల వివరాలను జనసేన పార్టీ మీడియా విభాగం సోమవారం విడుదల చేసింది. తెలంగాణ జనసేన నేతలు నేమూరి శంకర్‌గౌడ్‌, రామ్‌ తాళ్లూరితో పవన్ కళ్యాణ్ చర్చించి కమిటీలను ఖరారు చేశారు.