జేసీ దివాకర్ రెడ్డి, 1983 ఒక్క ఎన్నికలు తప్పా… తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఇప్పటి వరకు ఓట మెరుగకుండా గెలుస్తూనే వస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి మనస్సులో ఏది దాచుకోకుండా ఎవరినైనా ఏదైనా విమర్శించాలంటే, పాలక పక్షమా… ప్రతిపక్షమా అని సంబంధం లేకుండా ఏకేస్తూ ఉంటారు. జేసీ దివాకర్ రెడ్డికి చిరకాల కోరిక ఒకటి ఉంది. అనంతపురం టౌన్ లోని గాంధీ బజార్, తిలక్ రోడ్డు విస్తరణ జరిపించాలని చూస్తున్నారు.

కానీ లోకల్ తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అడ్డుపడుతూ వస్తున్నారు. ఇక ఏమి చేయలేక కొన్ని రోజులు నిమ్మకుండి పోయారు. మొన్న పార్లమెంట్ లో అవిశ్వాసం సందర్భంగా అదను చూసి దెబ్బ కొట్టాడు జేసీ. నేను పార్లమెంట్ కు వెళ్లనని, రేపో, మాపో రాజీనామా చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు.

దీనితో కంగుతిన్న తెలుగుదేశం అధిష్టానం రాయబారానికి పిలిచి చంద్రబాబుతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జేసీ తన అలుకు కారణంతో పాటు, చాంతాడంత లిస్ట్ టిడిపి అధినేత చంద్రబాబు ముందు పెట్టినట్లు తెలుస్తుంది. ముందుగా గాంధీ బజార్, తిలక్ రోడ్డు విస్తరణ జరపాలని, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాను పార్టీలోకి చేర్చుకోవాలని, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డికి హుడా ఛైర్మెన్ పదవి ఇవ్వాలని తన చిట్టా చంద్రబాబు ముందు పెట్టారట.

chandrababu jc

చంద్రబాబు నాయుడు ముందుగా అనంతపురంలో రోడ్ల విస్తరణకు సంబంధించి లోకల్  ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పిలిచి దానిలోని లోటు పాట్లు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. తరువాత గుంతకల్లు విసయంలో చంద్రబాబు లోక ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ తో మాట్లాడి మధుసూధనా చారి చేరికపై క్లారిటీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇక హుడా చైర్మన్ గుర్నాధ్ రెడ్డికి ఇవ్వాలని జేసీ పెట్టిన కండిషన్ పై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వ్యతిరేకిస్తున్నారు. కానీ జేసీ దివాకర్ రెడ్డి అడగటంతో చంద్రబాబు కాదనలేక ఒకే చెప్పినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. అనంతపురంలో తెలుగుదేశం ఎక్కువ సీట్లు గెలవడానికి జేసీ ఒక కారణమని అందుకే అతను కోరిన కోర్కెలు తీర్చడానికి చంద్రబాబు సిద్ధమయ్యాడని తెలుస్తుంది.

తెలుగుదేశం సీనియర్ నాయకులు మాత్రం జేసీ దివాకర్ రెడ్డి అదను చూసి తన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి అధినేత మీద కత్తి పెట్టాడని, ఇది అంతా జేసీ బ్లాక్ మెయిల్ రాజకీయమని, జేసీ చేసిన పని ఎంత మాత్రం కరెక్ట్ కాదని కొందరు సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతానికైతే జేసీ అడిగినవి చేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడని, ముందు ముందు రోజులలో రాజకీయాలు ఎలా మారతాయో చూడాలని అక్కడ తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యానించుకుంటున్నారు.