జేసీ దివాకర్ రెడ్డి గురించి చెప్పాలంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడి, కొన్ని సార్లు సొంత పార్టీ నేతల చేతిలోనే తిట్లు తింటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ ను విమర్శించడానికి జేసీ దివాకర్ రెడ్డిని బాగానే ఉపయోగించుకుంటున్నాడని తెలుస్తుంది. జేసీ దివాకర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో రాజకీయాల నుంచి తప్పుకొని తన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని అనంతపురం పార్లమెంట్ కు పోటీ చేయించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఇప్పుడు అయన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి కూడా తన నోటికి తండ్రిలాగే పని చెవుతున్నాడు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నయని, అయన చేయాలనుకున్న మంచి పనులకు, అయన భావజాలాలు ఎప్పుడు స్వాగతిస్తానని జేసీ పవన్ తెలియచేసాడు.

జనసేన పార్టీ స్థాపించనప్పటి నుంచి గమనిస్తున్నానని అయన పార్టీపై తనకు అవగాహన ఉందని, నిన్నటి వరకు ఎంతో సఖ్యత మెలిగే పవన్ ఈరోజు హఠాత్తుగా చంద్రబాబు – లోకేష్ ల పై దాడి చేయడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ కు కేంద్రం నుంచి ఒక ఫోన్ వచ్చిందని ఇక నుంచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయవద్దని, మీకు మేము సహాయం చేస్తామని చెప్పడం వలనే తరువాత రోజు నుంచి పవన్ కళ్యాణ్ లో టోన్ మారిందని జేసీ పవన్ తెలియచేసాడు.

పవన్ కళ్యాణ్ వామపక్షాలు, బిజెపి అండతో ముందుకు వెళ్లడం కష్టమని, గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని విమర్శించిన వైసిపి పార్టీకి ఎలాంటి దుస్థితి నెలకొందో చూస్తూనే ఉన్నామని పవన్ తెలియచేసాడు. జనసేన పార్టీలో చేరికలు బాగానే ఉంటాయని, ఎందుకంటే వైసిపి, తెలుగుదేశం పార్టీలో సీటు రాని నేతలు జనసేన వైపు చూసే అవకాశం ఉందని అన్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకుండా తమ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడతారని, బిజెపి వారు రాష్ట్రానికి ఏవిధంగా అన్యాయం చేసారో తెలుసునని, చంద్రబాబు మొక్కోవొని దీక్షతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడని పవన్ వ్యాఖ్యానించాడు.

జేసీ పవన్ చెప్పినట్లు ఒక వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిన విషయంపై నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అన్నప్పుడు, ఆ వ్యక్తి పేరు కూడా చెబితే బాగుండేదని ఇలా లేనిపోని పుకార్లు తెలుగుదేశం నాయకులు పుట్టించడంపై పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఈరోజు జేసీ పవన్ తనకు తానుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవలసిన పని ఏమి వచ్చిందా అని ఆలోచిస్తే, అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి – జేసీ కుటుంబానికి వైరం ఎప్పటి నుంచో ఉంది. రెండు రోజుల క్రితం పరిటాల శ్రీరామ్ ఒక సభలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి చంద్రబాబు దగ్గర మన్ననలు పొందడానికి ప్రయత్నించాడు. పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలకు అనుగుణంగా జేసీ పవన్ కూడా పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసాడని తెలుస్తుంది. జేసీ పవన్ కు రాజకీయాలలో ఎక్కడ వెనకపడిపోతానేమో అన్న బయమైనా ఉండి ఉండాలి, లేక పరిటాల శ్రీరామ్ లాగా చంద్రబాబు దగ్గర తన పరపతిని పెంచుకునే ప్రయత్నమైనా చేసి ఉండాలి. ప్రస్తుతానికి ఎలా ఉన్నా, వచ్చే ఎన్నికలలో రెండు వైరి కుటుంబాలకు చెందిన సీనియర్ నాయకుల కొడుకులు అనంతపురం జిల్లాలో వున్న అనంతపురం పార్లమెంట్, హిందూపూర్ పార్లమెంట్ స్థానాలకు తెలుగుదేశం తరుపున పోటీ చేసి సత్తా చాటడానికి కృషి చేస్తున్నారు.

Tags : JC Pavan Reddy, Paritala Sriram, Telugudesam Party, Pawan Kalyan, Janasena party