హరికృష్ణ మరణం తరువాత అందరి కళ్ళు జూనియర్ వైపు చూస్తున్నాయి. 2009 ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన వాక్ చాతుర్యంతో తెలుగు దేశం పార్టీకి ప్రచారం నిర్వహించినప్పుడు జనం వెల్లువలా తరలివచ్చారు. ఆ ఎన్నికల ప్రచారం చూసిన తెలుగుదేశం అభిమానులు చంద్రబాబు నాయుడు తరువాత తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ చేతిలో పెడితే మంచి భవిష్యత్ ఉంటుందని వాపోయారు. కట్ చేస్తే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, అమెరికాలో ఉండే లోకేష్ వచ్చి తండ్రి చెంతకు చేరి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో చంద్రబాబు జూనియర్ ను మెల్లగా దూరం జరిపారు.

కారణం జూనియర్ కనుక పార్టీలో ఉండి ఇలానే ప్రచారాలు అవి ఇవి అంటూ ఎప్పుడు హడావిడి చేస్తే తన కొడుకు భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందన్న విషయం గ్రహించారు. అంటే లోకేష్ గురించి చంద్రబాబు అప్పటికే ఒక అంచనాకు వచ్చారా అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ మాటలో పదును, దూసుకుపోయే తత్త్వం లోకేష్ లో ఏమాత్రం లేవు. లోకేష్ ఒక మీటింగ్ లో మాట్లాడితే 36 తప్పులు ఉంటాయి. వాటిపై సోషల్ మీడియాలో ఏవిధంగా ట్రోలింగ్ జరుగుతుందో ఇప్పటికే చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు తన కొడుకుని కాకుండా నందమూరి చిన్నోడికి పగ్గాలు అప్పచెప్పడం అన్నది కలలో కూడా జరగని పని అలాంటిది హరికృష్ణ చనిపోవడంతో తెలుగుదేశం పొలిట్ బ్యూరోలో హరికృష్ణ స్థానం తన తనయుడైన ఎన్టీఆర్ కు ఇవ్వాలని ఒక వర్గం ఇప్పటికే పట్టుబడుతోంది. కానీ చంద్రబాబు గురించి తెలిసిన వారు ఎవరైనా ఎన్టీఆర్ ను పోలిబ్యూరో సభ్యత్వం గురించి పక్కన పెడితే అసలు తెలుగుదేశం పార్టీలోకి రాణించే అవకాశమే లేదని చెబుతున్నారు.

cbn lokesh

కానీ ఈమధ్య కాలంలో పొలిటీషియన్స్ జాతకాలు చెప్పడంలో సిద్ధహస్తుడిగా పేరు పొందిన వేణు స్వామి హరికృష్ణ మరణం తరువాత ఎన్టీఆర్ జాతకంపై విశ్లేషించారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక ఐదారేళ్ళ గడిచిన తరువాత ముఖ్యమంత్రి హొధాలొ కనిపిస్తాడని, బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. గతంలో 2009 ఎన్నికలు ముగించుకొని తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఎన్టీఆర్ కార్ యాక్సిడెంట్ కు గురై చావు నుంచి బయట పడ్డాడు. అప్పుడు యాక్సిడెంట్ తప్పించుకొని బయట పడటం కూడా ఎన్టీఆర్ జాతకరీత్యా యోగం ఉండటం వలనే అని తన జాతక ఫలంలో రవి, కుజ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయని శుక్రుడు – రాహువు కాంబినేషన్ రాజయోగం కనిపిస్తుంది. తెలుగుదేశం దీన స్థితిలో ఉండగా ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినపడుతుందని, ఆ సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటాడని వేణు స్వామి సెలవిస్తున్నారు.

కానీ వేణు స్వామి చెప్పిన జాతకం చూసి ఒక వర్గం వారు నవ్వుకుంటుండగా, మరో వర్గం ప్రజలు కొందరు జాతకంలో అలా ఉంటె కచ్చితంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహిస్తాడని చెబుతున్నారు. అసలు వీటి సంగతి తరువాత ముందు చంద్రబాబు నాయుడు లోకేష్ ను కాకుండా జూనియర్ కు పగ్గాలు అప్పగిస్తాడా అంటే అది జరగని పని. మరి తెలుగుదేశం పార్టీలో జూనియర్ కు స్థానం లేకపోతే, ఈమధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టవచ్చని సంకేతాలు వచ్చాయి. మరి కొత్త పార్టీ నుంచెమైన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహిస్తాడా అనేది వేణు స్వామి చెప్పినట్లు ఒక ఐదు సంవత్సరాలు ఆగితే గాని తెలియదు.