పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు కాపు నాడు సంగం తీవ్రంగా స్పందించింది. వైఎస్ జగన్… పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాక్యలను వెనక్కు తీసుకోకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. పవన్ కళ్యాణ్ కోసం కాపు నాడు అధ్యక్షుడు ఇంతలా ఎందుకు స్పందించాల్సి వచ్చిందో అర్ధం కాకా అందరూ తలలు పట్టుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజల మధ్య తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ చాల సందర్భాలలో మాట్లాడుతూ దయచేసి నన్ను కాపు కులం వాడిగా చూడవద్దని, నాకు అన్ని మతాలు కావాలని ప్రకటించుకున్నారు. కానీ కాపు నాడు అధ్యక్షుడు ఆవేశంగా బయటకు వచ్చి ఇలా వైఎస్ జగన్ ను హెచ్చరించడంతో పవన్ కళ్యాణ్ కాపులకు ఒక్కరికే ప్రతినిధి అనేలా స్పందించారు.

ఇలా కాపునాడు ప్రతినిధులు ప్రకటన ఇవ్వడంతో వచ్చే 2019 ఎన్నికలలో 175 స్థానాలలోపోటీ చేయడానికి సిద్ధమైన జనసేన పార్టీకి మీ కాపు నాడు వారే కులం రంగు పులిమి జనసేనను అదః పాతాళానికి తోక్కేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అన్ని కులాల్లో ఉన్న పవన్ అభిమాను స్పందిస్తున్నారు. మీరు ఇచ్చిన ఈ ప్రకటనతో వారిని జనసేనకు దూరం చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారా అనేలా ఉంది.

అసలు రాజకీయాలలోకి ఎవరు వచ్చినా వారిని వ్యక్తిగత విమర్శలు చేయడం ఈరోజులలో అన్ని పార్టీలకు పరిపాటిగా మారింది. అది ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఇదే విధంగా తయారయ్యాయి. అసలు ఈ కాలంలో రాజకీయాలలోకి అడుగుపెడుతుంటేనే ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే విమర్శలను తట్టుకొని నిలబడగలగాలి. కానీ మీరు కాపు కులానికి చెందిన వాడిని అంటున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ ను అందరి వాడుగా కాకుండా కొందరి వాడుగానే ముద్రవేసి ప్రయత్నాలు చేయడం బాధించే విషయం. టీ కప్పులో తుఫానులా ముగిసిపోయే దానికి కాపు నాడు అంతలా ఆవేశ పడవలసిన అవసరం ఏమొచ్చిందో అర్ధం కావడం లేదు.

మీకు కాపులపై అంత ప్రేమ ఉంటె కాపుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి కాపుల భవిష్యత్ కోసం ఎల్లవేళలా కృషి చేసే ముద్రగడ పద్మనాభం వెనక అండగా నిలబడి తెలుగుదేశం పార్టీ కాపులకు ఇస్తాన్న రిజెర్వేషన్ ఇచ్చేలా గట్టిగ పోరాడండి. ముద్రగడ గారి కుటుంబాన్ని రోడ్లపై ఈడ్చుకెళుతూ, వినడానికి వీలు కానీ బూతులతో ఆడవారి చీరలు చినుగుతున్నా, ముద్రగడ గారి కొడుకుని గొడ్డును బాదినట్లు బాదుతూ తీసుకువెళ్తే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏమి చేయలేక, వైఎస్ జగన్ ఏదో ఒక రాజకీయ విమర్శ చేసాడని మా ప్రతాపం చూపిస్తామనడం ఎంత వరకు సబబు.