జనసేన పార్టీ ఎదగకూడదు దాని భావజాలం ప్రజలలోనికి వెళ్ళకూడదు అనే ఉద్దెశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ ఉన్నారని వ్యాఖ్యలు చేసారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో కాటన్‌ బ్యారేజీపై సోమవారం నిర్వహించిన కవాతు విజయవంతంగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికలలో రాష్ట్రము విడిపోవడం వల్ల ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో ఆనాడు టీడీపీకి మద్దతిచ్చానని.. కానీ టీడీపీ వారు చేస్తున్న అక్రమాలను చూస్తూ ఊరుకోనని అన్నారు. 2019 ఎన్నికలలో జనసేన ఆధ్వర్యంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న ఆయన.. పంచాయతీ ఎన్నికల్లో దిగే ధైర్యం టీడీపీకి లేదని.. వైసీపీ కూడా ముందుకు రాదని.. ఆ ఎన్నికలు పెడితే జనసేన పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని పవన్‌ ఛాలెంజ్‌ చేశారు.

సొంత అన్నయ్యను వదిలి వచ్చి ఆనాడు టీడీపీకి మద్దతిచ్చానని.. కానీ వారు తన తల్లిని కూడా తిడుతుంటే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. నాకు హెరిటేజ్‌లా వేల కోట్లున్న పరిశ్రమలు లేవు. వందల కోట్ల ఆస్తులు లేవు. నాకు దేశం మీద, అక్కచెల్లెళ్లు, ప్రజల మీద ప్రేమ ఉంది.. అంటూ చెప్పారు. తల్లికి అన్నం పెట్టనివాడు.. పిన్నికి చీర పెడతారని ఎలా అనుకుంటామని ప్రశ్నించారు. అలాగే జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం, శక్తి చంద్రబాబుకు లేకున్నా.. ఆ దోపిడీ వ్యవస్థను ఎదురొడ్డే సత్తా జనసేనకు ఉందని వపన్‌కల్యాణ్‌ ధీమా ప్రకటించారు.

kavathu

Janasena Kavathu Photo

అభిమానులంతా ను సీఎం సీఎం అని అరుస్తుంటే… మీరు చేసే నినాదమే నిజమవుతుందని అన్నారు పవన్ కళ్యాణ్. మా తాత, నాన్న సీఎం అయ్యారు కనక నేనూ సీఎం అవుతానని లోకేష్ అనుకున్నప్పుడు, ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకు సీఎం ఎందుకు కాలేడు, కచ్చితంగా అవుతాడని అన్నారు పవన్. కాగా ఈ కవాతులో పవన్ కళ్యాణ్ తో పాటు, తెనాలి మాజీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రావుల వెంకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.

jsp kavathu