2014 ఎన్నికలలో బిజెపితో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాలుగు సంవత్సరాల సాన్నిహిత్యం తరువాత బిజెపి నుంచి బయటకు వచ్చి బిజెపి చేస్తున్న అన్యాయాన్ని ప్రత్యేక సభలు పెట్టి మరీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతి, నెల్లూరు, విజయవాడ, విశాఖ ప్రజల సాక్షిగా మోదీ హామీ ఇచ్చి ఈరోజు ప్రత్యేక హోదాను తుంగలో తొక్కి రాష్ట్రానికి భ్రస్టుపట్టిస్తున్న బిజెపితో ఇక ఎప్పటికి కలసి ప్రసక్తి లేదని ఏపీ డిప్యూటీ సీఎం కెఇ కృష్ణ మూర్తి తెలియచేసాడు.

రాజకీయంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని బిజెపి పార్టీ వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ తో కలసి తన వ్యూహాలు అమలు చేస్తుందని మండిపడ్డారు. బిజెపి అంటే బ్రోకర్స్ ఫర్ జగన్ అండ్ పవన్ అని అన్నారు. పవన్ తో ఒకవైపున, జగన్ తో ఒకవైపున లాలూచి రాజకీయాలు నడుపుతా మమల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇది అంత ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజులలో జనసేన, బిజెపి, వైసిపి పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని కెఇ కృష్ణ మూర్తి తెలియచేసారు.