కాంగ్రెస్ పార్టీలో జాక్ పాట్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల ముందు తన బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకొని చెప్పు గుర్తుతో ప్రజల మధ్యలోకి వెళితే రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణమైన కిరణ్ అండ్ కో మీద ప్రజలు చెప్పు పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థుల మీద చెప్పులు విసరడం ఒక్కటే మినహాయించి.. ఓటు అనే ఆయుధంతో కిరణ్ పార్టీకి డిపాజిట్ లు కూడా లేకుండా చేసారు. ఇక నాలుగు సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్న కిరణ్ ఒక సారి తెలుగుదేశం పార్టీలోకి వెళతాడని, మరొకసారి బిజెపిలోకి వెళతాడని రకరకాల వార్తలు వచ్చాయి. చివరకు ఆంధ్రప్రదేశ్ లో 100 అడుగుల లోతుకి ప్రజలు పాతి పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరి తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రమంలో కిరణ్ మాట్లాడుతూ తాను రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడినని చెప్పుకునే ప్రయత్నం చేసాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడు అతని పంచన చేరి చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీతో కలసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడి జగన్ మీద కుట్రలు చేసి జైలుకి పంపించడంలో కిరణ్ కుమార్ రెడ్డిది కూడా కీలక పాత్ర పోషించాడన్న విషయం ప్రజలు ఎవరు మర్చిపోలేదన్న సంగతి కిరణ్ మర్చిపోయినట్లు ఉన్నాడు.

కిరణ్ ఇంకా మాట్లాడుతూ తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని బంధం ఉందని, కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబానికి గుర్తింపు ఇచ్చిందని, గాంధీ కుటుంబంతో సన్నిహితంగా ఉండటం వలనే చీప్ విప్, స్పీకర్, ముఖ్యమంత్రి వంటి పదవులు దక్కాయని తెలియచేసారు. విభజన హామీలు కేంద్రం నెరవేర్చలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన హామీలను అమలు చేస్తుందని కిరణ్ తెలియచేసారు. కాంగ్రెస్ పార్టీని వీడిన నలభై, యాభై మందిని తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువస్తానని కిరణ్ తెలియచేసాడు.

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, కాంగ్రెస్ కలసి పోటీ చేస్తాయన్న సంకేతాలతో కిరణ్ పార్లమెంట్ ఎన్నికలలో రాజంపేట నుంచి పోటీ చేయవచ్చని అతని సన్నిహితులు చెవుతున్నారు. రాజంపేట పార్లమెంట్ స్థానంలో తెలుగుదేశం పార్టీ కూడా బలహీనంగా ఉంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కిరణ్ పోటీ చేయవచ్చని, ఒకవేళ రాజంపేట స్థానం నుంచి ఓడిపోతే రాజ్యసభకు నామినెటే చేయాలన్న ప్రతిపాదన కూడా కాంగ్రెస్ అధిష్టానం ముందు పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో యాక్టీవ్ గా ఉంటున్నారు. కిషోర్ ను తెలుగుదేశం పార్టీలోకి పంపించిందే కిరణ్ కుమార్ రెడ్డి అని, అలాంటిది ఇప్పుడు మరల కాంగ్రెస్ లో చేరి పాత కాపులను ఏకం చేస్తానని చెప్పి వైసిపిని దెబ్బ తీసేందుకు చంద్రబాబు – కాంగ్రెస్ పార్టీ కలసి పధకం రచిస్తున్నట్లు కనపడుతుంది.

Tags : Kiran Kumar Reddy, Congress Party, Ys Rajashekar Reddy, Gandhi Family, Rajampeta