రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమతో నాటిన మొక్కకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారని తెలంగాణ జనసమితి నేత కోదండరాం చెబుతున్నారు. కోదండరాం ఇంకా మాట్లాడుతూ కేసీఆర్ సర్కారునే కూలుస్తామని మాట్లాడుతున్నారు. కేసీఆర్ పాలనా సరిగ్గా లేని కారణంగా దానిని కూలుస్తామని, ముఖ్యమంత్రి నాటిన మొక్క మీద ఉన్న ప్రేమ రైతుల మీద ఎందుకు లేదని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేసారు.

కోదండరాం చేసే విమర్శలు బాగానే ఉంటాయి కానీ కామెడీగా ప్రభుత్వాన్ని కూలుస్తాను అనడమే కొంత ఎబెట్టుగా ఉంది. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ చాల స్ట్రాంగ్ గ ఉంది. వచ్చే 2019 ఎన్నికలలో కూడా కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని ఇప్పటికే అనేక సర్వేలు తెలియచేస్తున్నాయి. కోదండరాం పెట్టె పార్టీ కొంత ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూర్చడానికి పనికి వస్తుంది తప్ప, ప్రస్తుతానికైతే తెలంగాణ జనసమితి పార్టీ ప్రజలలోకి అంత గట్టిగా చొచ్చుకెళుతున్న దాఖలాలు లేవు.