కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేసారు. త్వరగా పొత్తులు, సీట్లపై తేల్చాలంటూ లేక పోతే తమ దారి తాము చూసుకుంటానంటూ హెచ్చరించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన ఇంకా సీట్లు కేటాయింపుపై క్లారిటీ లేదన్న కోదండరాం.. సీట్ల సర్దుబాటుపై తేల్చాలంటూ కాంగ్రెస్ పార్టీకి లెఖ రాసారు. తాము కోరుకున్న సీట్లు ఇవ్వాల్సిందేనన్న ఆయన.. లెఖ పోతే తమకు అనుకూలమైన వారితో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరో రెండు రోజులలో 21 మందితో తొలి జాభితాను కూడా ఆయన ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. కాగా కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో 100 స్థానాలు పోటీ చేసి.. మిగతా పార్టీలకు 19 స్థానాలకే పరిమితం చేయాలని భావిస్తుంది.