తెరాస అసమ్మతి నేతలు కొండా మురళి, కొండా సురేఖ బుధవారం రాహుల్ గాంధీ సమక్షములో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. తమకు కేటాయించాల్సిన సీట్లపై పూర్తి స్థాయిలో హామీ తీసుకున్న అనంతరమే వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సమాచారం. కొండా దంపతులు కాంగ్రెస్‌లోకి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా తెరాస లో తమకు టికెట్‌ కేటాయించలేదని సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా కొండా దంపతులు ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.