కాంగ్రెస్ సీనియర్ నేత, కర్నూల్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం… కోట్ల ఈ నెల 28న తెలుగుదేశంలో చేరనున్నారని.. కోడుమూరులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభకు కనీసం లక్ష మందిని తరలించే యోచనలో కోట్ల ఉన్నట్లు తెలుస్తుంది. మరో రెండు, మూడు రోజులలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చే పార్లమెంట్ బరిలో ఎంపీ గా పోటీచేయనున్నారు.

ఈ క్రమంలో ఆలూరు నుండి కోట్ల సుజాతమ్మ పోటీ చేసే అవకాశం ఉంది. కోట్ల కుమారుడు రాఘవేంద్ర రెడ్డికి కూడా ఏదైనా పదవి కేటాయిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అలాగే డోన్ నియోజకవర్గం నుండి కూడా తమకే సీటు కేటాయించాలని కోట్ల కుటుంభం కోరుతుంది. ఇప్పటికే డోన్ నియోజకవర్గం నుండి బరిలో దిగాలని కేఈ కుటుంబం ఆశిస్తుంది. టీడీపీలో కోట్ల చేరడంతో ఆ పార్టీకి కొంత జోష్ అని చెప్పవచ్చు.

kotla Suryaprakash Reddy