కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారనే అంశం చర్చ సాగుతుండగా.. ఆయన సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరారు. కడపలో జగన్ ను కలసిన ఆయన.. హర్షవర్ధన్ రెడ్డికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 2వేల మందితో ఆయన పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీలతో పాటు, ఏడుగురు ఎంపీటీసీలు, పలువురు సర్పంచ్‌లు కూడా వైసీపీలో చేరారు.

ఇక సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. కోట్ల టీడీపీలోకి కర్నూలు ఎంపీ టికెట్ ఖరారు అయినట్టే. అయితే ఆయన భార్య కోట్ల సుజాతమ్మకు డోన్ ఎమ్మెల్యే టికెట్ విషయంలో తర్జనభర్జనలు సాగుతున్నాయి. డోన్ సీటును టీడీపీలో కేఈ వర్గం ఆశిస్తోంది. డోన్ టికెట్ విషయంలో షరతు లేనట్టుగా అయితే కోట్ల వర్గం తెలుగుదేశంలోకి చేరడంపై తమకు అభ్యంతరం లేదని కేఈ వర్గం అంటోంది.