తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం మరోసారి గెలిచిన తరువాత కేసీఆర్ ప్రమాణస్వీకారం అనంతరం, తన కుమారుడు కేటీఆర్ ను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడంతో రాబోయే రోజులలో కాబోయే యువరాజు అని ఇప్పటి నుంచే మీడియా మొత్తం కీర్తిస్తుంది. కేటీఆర్ కూడా దానిని అలుసుగా తీసుకోకుండా తనదైన రీతిలో స్పందిస్తూ, తనను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి బాధ్యత తనకు అప్పగిస్తున్నట్లు కాదని, ఎప్పటికి కేసీఆర్ నే ముఖ్యమంత్రిగా ఉంటారని సెలవిచ్చారు.

ఇక ఇదే సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రత్యర్థులందరు కలసి టీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా భూస్థాపితం చేయాలని వేసిన పన్నాగాలు చిత్తయ్యాయని, అందులో ప్రముఖంగా కొన్ని మీడియా సంస్థలు, పచ్చ పత్రికలు చివరి వారం రోజులు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అన్నట్లు వార్తలు పుట్టించి ప్రజలను కొంత కన్ఫ్యూషన్ కు గురి చేసారని, లగడపాటి సర్వే పేరుతో ప్రత్యర్థి పార్టీలు ఆడిన నాటకాలు కూడా పటాపంచలయ్యాయని, లగడపాటి సర్వేను పదే పదే పచ్చ న్యూస్ చానెల్స్ లో కేసీఆర్ ఓటమి తథ్యం, చంద్రబాబు రాజకీయ చాణిక్యత ఫలించిందని, మహాకూటమి అధికారంలోకి రాబోతుందని పుంఖాను పుంఖాలుగా వార్తలు గుప్పించారన్నారు.

కేటీఆర్ ఎన్నికలకు ముందే తమపై తప్పుడు వార్తలు రాస్తున్న మీడియా సంగతి అధికారంలోకి వచ్చిన తరువాత చూస్తామని ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ పచ్చ మీడియా ఎలా అణగదొక్కడానికి చూసిందో చెప్పడం చూస్తుంటే కేటీఆర్ పచ్చ మీడియా రాసిన రాతలు మర్చిపోయేలా లేరు. కేటీఆర్ అన్నట్లు పచ్చ మీడియా సంగతి చూస్తారా లేక వారిని దారికి తెచ్చుకొని టీఆర్ఎస్ పార్టీకి జై కొట్టిస్తారో రాబోయే రోజులలో చూడాలి.

Telangana State 2018 Election Results