వైఎస్ జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. తరువాత జగ్గంపేట వేదికగా కాపుల రిజర్వేషన్ గురించి వైఎస్ జగన్ మాట్లాడి కాపులలో ఆగ్రహాన్ని చవిచాడు. దీనిపై వైసిపి వాదన నిక్కచ్చిగా ఉంటె, తెలుగుదేశం పార్టీ మాత్రం వైసిపి నేతలను కాపుల ఓట్ల నుంచి దూరం చేయడానికి శతవిధాలా చేస్తుంది.

ఇందులో భాగంగా ఈరోజు లక్ష్మి పార్వతి మీడియా ముందుకు వచ్చి అసలు నాలుగు సంవత్సరాలు బీజేపీ, టిడిపి, జనసేన కలసి కాపురం చేసి ఈరోజు నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ డ్రామాలాడుతున్నారని లక్ష్మి పార్వతి తెలియచేసారు. తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటు పవన్ కళ్యాణ్ వైపు మళ్లకుండా వైఎస్ జగన్ జాగ్రత్పడుతున్నదని తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మి పార్వతి మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం, జనసేన పార్టీలపై విమర్శలు చేసారు.