పవన్ కళ్యాణ్ తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకపోగా, పక్క వారిపై నిందలు వేయడం ఎంత వరకు కరెక్ట్ అని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కు బురద జల్లడం అలవాటుగా మారిందని, ఇంత వరకు తనపై చేసిన ఏఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేదని లోకేష్ వ్యాఖ్యానించారు. ఎందుకు పవన్ ప్రతిసారి నాపై ఆరోపణలు చేస్తాడో అర్ధం కావడం లేదనిలోకేష్ పవన్ ను అడిగారు.

శేఖర్ రెడ్డి నోట్ల కుంభకోణంలో తనకు సంబంధం ఉందని పవన్ వ్యాఖ్యానాలు చేసారని నాకు చాల బాధ కలిగిందని, రుజువు చేయమంటే ఇంత వరకు అతి గతి లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. పవన్ పై ఆరోపణలు చేస్తే పవన్ కళ్యాణ్ ఎలా బాధపడతారో నేను అలానే బాధపడుతున్నా అని నాపై చేసిన ఆరోపణలకు ఒక్కటైనా పవన్ నిరూపించాలని, ఆరోపణలు లేని వ్యాఖ్యల వలన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతాయని లోకేష్ తెలియచేసారు.

పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే తన అభిమానుల చేత పరుష పదజాలంతో, జుగుత్సాకరమైన వ్యాఖ్యలతో విరుచుకుపడతారు. మరి పవన్ పక్క వారి మీద కూడా అలంటి ఆరోపణలు చేసినప్పుడు నిరూపించుకోవాలి కదా లోకేష్ అడిగిన దానిలో మంచి పాయింట్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు రాజకీయాలలో ఆరోపణలు చేయడమే తప్పా నిరూపించడానికి ప్రయత్నించినా దాఖలాలు కూడా లేవు.