తనపై కొన్ని పత్రికలు, టీవీలు దౌర్బాగ్యమైన ప్రచారం చేశాయని నెల్లూరు వైసీపీ మాజీ ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని.. తాను మళ్ళి పోటీచేస్తానని ఆయన అన్నారు. తనకు, జగన్ మోహన్ రెడ్డి కు మద్య ఏదో తగాదా వచ్చిందని అబద్దపు ప్రచారాన్ని కొన్ని టీవీ ఛానెల్స్ ప్రచారం చేశాయని, ఇంత దుర్మార్గం ఏమైనా ఉందా? అని ఆయన అన్నారు. జగన్ లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని.. తాను ఓదార్పు యాత్ర సమయంలోనే చెప్పానన్నారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటు జగన్ తీరుస్తున్నాడన్నారు. కాని కొన్ని మీడియా సంస్థలు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. తనను జగన్ కు ఏవిధమైన భేదాభిప్రాయాలు లేవన్నారు.