రేవంత్‌రెడ్డికి ఆయనే వెళ్లి జైలులో కూర్చోవాలనే తొందర ఉన్నట్టుందని విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాల యంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడికుంట వెంకటేశ్వర్లుతో కలసి ఆయన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఐటీ సోదాలు ఒక నేత ఇంటిపై జరిగితే తుపాన్లు వచ్చినట్టు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కాంగ్రెస్‌ నేతలు ప్రవర్తిస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ఐటీ సోదాలు జరుగుతాయన్న జగదీశ్‌రెడ్డి.. కాంగ్రెస్‌ నేతలు తమతో జైళ్లు నిండుతాయేమో అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారన్నారు. అలాగే పెద్దోళ్లను తిడితే పెద్దోడ్ని అవుతానని కేసీఆర్‌ కుటుంబాన్ని రేవంత్‌ తిడుతున్నారు. ఐదుగురు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులపైనా ఐటీ సోదాలు జరిగాయన్నారు.

కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు నరేంద్ర మోడీ, కేసీఆర్‌లు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందా? ఆ పార్టీని ఎదుర్కొనేందుకు మా గ్రామ కార్యకర్త చాలు. గెలిచే శక్తి లేక కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయన్న జగదీశ్‌రెడ్డి.. వారి సర్వేల్లోనూ కాంగ్రెస్‌కు సీట్లు రావడం లేదు అని అన్నారు. రేవంత్ తప్పు చేశానని తెలిసినందునే జైలుకు వెళ్లి నామినేషన్‌ వేస్తానని అన్నారని జగదీశ్‌రెడ్డి చెప్పారు.

trs