అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ లను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. టీడీపీ నేత, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మావోయిస్టులు హెచ్చరిక జారీ చేస్తూ లేఖ రాసారు. గిడ్డి ఈశ్వరి అధికార పార్టీకి తొత్తుగా మారారని, 20 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయి టీడీపీలో చేరినట్టు అందులో పేర్కొన్నారు మావోయిస్టులు. ప్రజాకోర్టులో కిడారి నీ విషయంపై నిజం చెప్పాడు. నీకందిన అవినీతి సొమ్మును 2 నెలల్లో గిరిజనులకు పంచి క్షమాపణలు చెప్పాలి. బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకించాలి. లేదంటే నీకూ కిడారి, సోమలకు పట్టిన గతే పడుతుంది. అసలు ప్రజాద్రోహి, గిరిజన ద్రోహి, అధికారపార్టీకి తొత్తు అయిన గిడ్డి ఈశ్వరి తమను నిందించడమేంటని మావోయిస్టులు మండిపడ్డారు. నీవు అమ్ముడు పోయిన 20 కోట్ల రూపాయలను రెండు నెలలలోగా గిరిజనులకు పంచాలి లేదంటే కిడారి సర్వేశ్వరావు, సివేరి సోమలకు పట్టిన గతే పడుతుందని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.