తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బుధవారం ముగిసిపోయాయి . ఈ సందర్భంగా కొంత మంది టాలీవుడ్ ప్రముఖులు బయటకు వచ్చి వారికి నచ్చిన వారికి ఓటు వేయాలని కోరారు. మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపగా ఇప్పుడు మంచు మోహన్ బాబు కూడా మద్దతు తెలియచేసారు.

మంచు మోహన్ బాబు కేసీఆర్ కు మద్దతు తెలియచేస్తూ, 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ కు తాను ఒక విలన్ లా కనిపించానని, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కస్టపడి సాధించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కులజాడ్యం ఎక్కువని, అలాంటి కుల జాడ్యం తెలంగాణాలో లేకుండా చూడాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందని అన్నారు. ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికలలో కేసీఆర్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలియచేసారు.  

 

కేసీఆర్ పొలిటికల్ ప్రొఫైల్  ,  గజ్వెల్ 1983 నుంచి 2014 వరకు ఎన్నిక ఫలితాలు వీక్షించండి