చిత్తూరు ఎంపీ శివప్రసాద్ రోజుకొక వేషధారణతో పార్లమెంటు ముందు ఆసక్తి కలిగిస్తున్నారు. కొంత మంది ఇతర రాష్ట్రాల ఎంపీలైతే ఈరోజు శివప్రసాద్ ఏమి వేషం వేశాడో అని వచ్చి ఆలా చూసి వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎంపీగా ఉండి శివప్రసాద్ వేసే వేషధారణ పార్లమెంట్ దగ్గర ఫేమస్ గా మారిపోయింది. ఇక ఈ రోజు శివప్రసాద్ హిజ్రా వేషధారణలో మోదీ… మోదీ బావ అంటూ హేళన చేస్తుండటం కనపడింది. అందుకు కాంగ్రెస్ నేత సోనియా గాంధీ కూడా ప్రశంసలు కురిపించడం జరిగింది.

శివప్రసాద్ మోదీని ఉద్దేశించి చంద్రబాబు కోపానికి తట్టుకోలేవు అన్నట్లు మాట్లాడటంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేవిధంగా వేషధారణకు తగట్లు “ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం” అంటూ పాటలు పాడుతూ సెటైర్లు వేశారు.