చంద్రబాబు నాయుడు గతం తవ్వితే అన్ని మచ్చలే ఉంటాయి. అందుకని చంద్రబాబు నాయుడు తన గతాన్ని ఎప్పుడు తవ్వుకోవడానికి ప్రయత్నించరు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతాన్ని తవ్వడానికి ముందు వరుసలో ఉంటూ పంటి కింద రాయిలా మారారు మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు. ఇప్పటికే నాదెండ్ల పలు యూట్యూబ్ చానెల్స్ లో సంచలన విషయాలు చెబుతూనే, ఇప్పుడు ఆయా ప్రాంతాలు పర్యటిస్తూ చంద్రబాబు గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నారు.

నాదెండ్ల భాస్కర రావు అన్నవరంలో సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చి చంద్రబాబు గురించి కొత్త విషయాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కడుతున్నాడని అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డికి కోపం వచ్చి అయన చేతిలో ఉన్న స్టిక్ తో కొట్టబోయారని నాదెండ్ల చెప్పుకొచ్చారు. చెన్నారెడ్డి అందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు మీద ఆగ్రహం వ్యక్తం చేసి కొట్టబోతే అక్కడ ఉన్నవారికి ఏమి జరుగుతుందో అర్ధం కాలేదని, ఆ తరువాత తాను చెన్నారెడ్డి వద్దకు వెళ్లి ఎందుకు చంద్రబాబు నాయుడు మీద అలా ప్రవర్తించారని అడిగితే కాంగ్రెస్ పార్టీలో ముఠాలను కడుతున్నాడని, చంద్రబాబు నాయుడుని ఎవరు దగ్గరకు చేరదీయవద్దని మాజీ సీఎం చెన్నారెడ్డి చెప్పారట.

nadendla

ఇక ఇదే సందర్భంలో నాదెండ్లను విలేకరి అడుగుతూ మీరు గతంలో ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తూ తిరుపతి రైల్వే స్టేషన్ లో చంద్రబాబు నాయుడు దొంగతనం చేసినట్లు కేసు ఉందని చెప్పారని అది నిజమేనా అడిగి అడుగగా నాదెండ్ల మరోసారి ఆ ఉదంతం వాస్తవమేనని చెప్పుకోచ్చారు. నాదెండ్ల చెబుతున్న చంద్రబాబు నాయుడు విషయాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సబ్యులకు కాక పుట్టిస్తున్నాయి. “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా ఎప్పుడైతే మొదలు పెట్టి నాదెండ్ల వెన్నుపోటు ఎపిసోడ్ కూడా సినిమాలో ఉంటుందని వార్తలు గుప్పుమన్నాయో అప్పటి నుంచి నాదెండ్లకు చిరెత్తుకొచ్చి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఎలా మొదలయింది, చంద్రబాబు నాయుడు అప్పట్లో ఎలాంటి నీచమైన కార్యక్రమాలు చేసేవాడో ప్రతి యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబబు నాయుడుకి వెన్నులో వణుకుపుట్టేలా చేస్తున్నారు.

ఇప్పటికే “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా మొదటి భాగం “కథానాయకుడు” విడుదలై సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను దాదాపుగా 70 కోట్ల రూపాయలకు అమ్మితే కనీసం 20 కోట్ల రూపాయలు కూడా కలెక్ట్ చేయలేదు. కానీ నాదెండ్ల ఇంటర్వూస్ మాత్రం మిలియన్ వ్యూస్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్ చేస్తూ “ఎన్టీఆర్ బయోపిక్” సినిమా కన్నా నాదెండ్ల భాస్కర రావు ఇంటర్వూస్ నే ఎక్కువ మంది చూస్తున్నారని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇంకా రానున్న రోజులలో నాదెండ్ల భాస్కర రావు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి ఇంకా ఎలాంటి సంచలన నిజాలు చెబుతాడో అని తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. నాదెండ్ల భాస్కర రావు చేస్తున్న విమర్శలు చంద్రబాబు నాయుడు ఒక్కడి మీదే కాకుండా దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ మీద కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఒక మహానాయకుడని అనుకుంటున్న వారికి నాదెండ్ల భాస్కర రావు… ఎన్టీఆర్ గురించి చెబుతున్నవి వింటే నిజంగా ఎన్టీఆర్ ఇలాంటి పనులు చేసేవాడా అనేలా ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. “ఎన్టీఆర్ బయోపిక్” సినిమాతో తెలుగుదేశం పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు పక్కా స్కెచ్ వేస్తే నాదెండ్ల దానికి విరుగుడుగా తాను ఇస్తున్న ఇంటర్వూస్ తో చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ పరువుని నడిరోడ్డు మీద అడ్డంగా తీసేస్తున్నారు.