చిరంజీవి తమ్ముడు, పవన్ కళ్యాణ్ అన్నయ్యగా నాగబాబు చాల పాపులర్, తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకోలేక పోయాడు. ఇప్పుడు తన ఇద్దరి బిడ్డలను సినిమా ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో నిలబెట్టడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు.

అప్పుడప్పుడు అన్నయ చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ తరుపున వకల్తా పుచ్చుకోవడంలో ముందు వరుసలో ఉంటాడు. అప్పట్లో నాగబాబు ప్రజారాజ్యం పార్టీలో చాల యాక్టీవ్ రోల్ పార్టిసిపేట్ చేసాడు. ఇక ప్రజారాజ్యం అధికారానికి దూరమై, కాంగ్రెస్ లో విలీనమవ్వడంతో ఆ తరువాత రోజులలో సైలెంట్ అయిపోయారు.

అప్పట్లో అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు అధికారం అన్నయ్యదే కాబోయే సీఎం అన్నయ్యే అని సన్నాయి నొక్కులు నొక్కిన నాగబాబు ఇప్పుడు తమ్ముడు పెట్టిన జనసేన పార్టీపై వకల్తా పుచ్చుకుంటున్నాడు. మొన్న జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు కూడా నాగబాబు రియాక్టయ్ జగన్ లాంటి నాయకుడు అలా మాట్లాడటం సరికాదని తెలియచేసాడు.

ఇక ఇప్పుడు మరో ఇంటర్వ్యూ లో తన తమ్ముడు 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఎంగా బారి మెజారిటీతో విజయం సాధిస్తాడని చెబుతున్నాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలవబోయేది తన తమ్ముడేనని, మెగా బ్రదర్ చెబుతున్న వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది.

సోషల్ మీడియా వేదికగా నాగబాబు వ్యాఖ్యలపై నెటిజన్లు గొల్లుమని నవ్వులు పూయిస్తూ, ఇంత వరకు పార్టీ గుర్తు రాలేదు, పార్టీలో నాయకుల చేరికలపై అతి గతి లేదు గాని పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. కొంత మంది నెటిజన్లు…  ఏపీ సీఎం సంగతి పక్కన పెడితే ట్విట్టర్ సీఎంగా పవన్ కళ్యాణ్ ఎంపికవుతాడని చెబుతున్నారు. కొంతమంది నెటిజన్లు ఇంకాస్త ముందుకు వెళ్లి పవన్ సీఎం అయితే మంత్రి వర్గంలో సభ్యులుగా షకలక శంకర్, హైపర్ ఆది, సప్తగిరి, సుడిగాలి సుధీర్ ఇలా తన కేబినెట్ ఉంటుందంటూ నెటిజన్లు పలు రకాల విమర్శలతో హాస్యం పండిస్తున్నారు.