లక్షల ఆదాయాల నుంచి కోట్ల ఆదాయాలకు పడగలెత్తిన తరువాత కొంత మందికి పొగరు తలకెక్కుతుందో, లేకేపోతే ప్రభుత్వంలో సభ్యులమైన మమల్ని ఎవరు ఏమి చేస్తారని ధీమాగా ఉంటారో తెలియదు గాని, అలా చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రముఖ హాస్య నటుడు బాబూమోహన్ ఇంటి నల్ల కనెక్షన్ హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు కట్ చేసారు.

బాబూమోహన్ వాటర్ బిల్ కట్టమని అధికారులు ఎన్ని సార్లు అడిగినా కట్టకపోవడంతో చివరకు ఆ బిల్ కాస్త నాలుగు లక్షల రూపాయలకు చేరడంతో చేసేదేమిలేక వాటర్ బోర్డు అధికారులు బాబూమోహన్ ఇంటికి నల్లా కనెక్షన్ కట్ చేసారు. బాబూమోహన్ తో పటు మరో నటుడు మాదాల రవి కూడా మూడు లక్షల రూపాయలు బకాయి పడటంతో అతని ఇంటికి కూడా కనెక్షన్ కట్ చేసారు. ప్రజలకు నీతులు చెప్పి ఎన్నికలలో ఓట్లు వేయించుకునే రాజకీయ నాయకులే ఇలా తప్పించుకొని తిరిగితే వచ్చే ఎన్నికలలో అలంటి నాయకుడికి ఓట్లు వేసి ప్రజలు గెలిపించే అవకాశం ఉందంటారా?