తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కెసిఆర్ పై ఏపీ మంత్రి నారా లోకేష్‌ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఓ పక్క తెలుగువారంతా కలిసుండాలంటూనే జాగో బాగో అంటూ కేసీఆర్‌ కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన లోకేష్.. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకోలేదా? అని ప్రశ్నించారు.తెరాస లో టీడీపీ వాళ్లు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసన్న లోకేష్‌… ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకోకుండానే జీహెచ్‌ఎంసీ పీఠాన్ని తెరాస చేజిక్కించుకుందా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యేలు తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.