తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఏపీ మంత్రి నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడువు తీరకముందే ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్‌ ప్రజలకు ఏం సమాధానం చెబుతారన్న లోకేష్… తెలంగాణలో ఐటీ పరిశ్రమలు పెద్దగా వచ్చిన దాఖలాలు కూడా లేవంటూ ఆరోపించారు. కేసీఆర్‌ అర్ధాంతరంగా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం భాధాకరమన్న ఆయన.. కేసీఆర్‌ నిరుద్యోగులకు భృతి ఇస్తారనుకున్నాం కానీ అది కూడా నెరవేర్చలేదని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దగ్గర ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య అక్రమ సంబంధం ఉందని వ్యాఖ్యానించిన లోకేష్.. బీజేపీ తో అక్రమ సంబంధం కొనసాగిస్తూ… ఎంఐఎం తమ మిత్రపక్షమని కేసీఆర్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ ఏం చెప్తాడని ఎద్దేవా చేసారు లోకేష్.