నారా లోకేష్ బాబు… చంద్రబాబు నాయుడు కొడుకుగా రాజకీయాలలోకి అడుగుపెట్టిన తరువాత అతని ప్రవర్తన అంతా వింత వింతగా ఉంటుంది. ఒక్కోసారి తెలుగుదేశం పార్టీని  తానే తిట్టుకుంటాడు. ఇంకోసారి మేమేసిన రోడ్ల మీద నడుస్తూ మమ్మల్నే తిడతారా అని ప్రతిపక్షాలను ఎద్దేవా చేస్తాడు. చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ మాట్లాడే భాషతో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని ఒక టీచర్ ను కూడా పెట్టినట్లు తెలుస్తుంది. కానీ అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు సరి కదా, అప్పటి నుంచి మరిన్ని తింగరి తింగరిగా మాటాడుతూ నవ్వుల పాలవుతున్నాడు.

నారా లోకేష్ నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మేము ఇచ్చే నిరుద్యోగ బృతితో సెల్ ఫోన్ కొనుక్కొని జల్సాలు చేయవద్దని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులంతా కంగుతిన్న పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో కూడా లోకేష్ వ్యాఖ్యలతో యువత అంత కామెడీ పేరడీలు చేస్తూ హాస్యం పండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చే 1000 రూపాయల బృతితో మేము సింగపూర్ వెళ్లి వద్దామనుకుంటున్నామని ఒకరంటే, మరొకరేమో మీరిచ్చే 1000 రూపాయలతో ఐఫోన్ కొనడానికి రెడీ అవుతున్నామని, ఇలా లోకేష్ బాబు మాటలపై సెటైర్లు పేలుతున్నాయి.

అధికారంలోకి వస్తే ఇంటికొక ఉద్యోగమిస్తామని యువతని మోసం చేసి, మరలా ఉద్యోగం లేని యువతకు నెలకు 2000 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల హామీలో చెప్పి ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రజలను ఆకట్టుకోవడానికి ఇలాంటి పధకాలను ఇప్పుడు అమలు చేస్తూ, అందులో కూడా గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నించి నవ్వుల పాలవుతున్నారు.