వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్ట్ లో శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేయడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పలుకోణాలలో విచారణ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి శ్రీనివాస్ కు ఒక చిన్న మిస్డ్ కాల్ ద్వారా పరిచయమైనా కనిగిరి చెందిన సైరాభి అనే మహిళ ఇచ్చిన వివరాలు సంచలనం కలిగించేలా ఉన్నాయి.

నిందుతుడు శ్రీనివాస్ కు ఆ యువతితో పరిచయమయిన తరువాత ఆ యువతి నిన్ను నేను చూడాలనుకుంటున్నానని, ఎలా చూడాలి అని అడగగా త్వరలో తాను వైఎస్ జగన్ పై దాడి చేయాలనుకుంటున్నానని, నన్ను నువ్వు టివిలో చూడు అని చెప్పినట్లు తెలుస్తుంది. సైరాభి ఇచ్చిన వివరాలతో వైఎస్ జగన్ కేసులో కొత్త కోణం బయటపడిందని చెప్పుకోవచ్చు. అంటే వైఎస్ జగన్ పై పక్కా ప్రణాళిక ప్రకారమే నిందుతుడు దాడికి పాల్పడినట్లు కనపడుతుంది.

వైఎస్ జగన్ పై జరిగిన దాడికి నిందుతుడిని కొన్ని రోజుల ముందే ప్రణాళిక చేసుకున్నట్లు వైఎస్ జగన్ ను హత్య చేయడానికి నిందుతుడు శ్రీనివాస్ ను ఎవరో ప్రోద్బలం చేసి హత్య చేయడానికి పురిగొల్పినట్లు కనపడుతుంది. దీనిపై పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేస్తే అసలు దోషులెవరో బయటకు వస్తారు. రోజులు గడిచే కొద్దీ, కాల్ డేటా ద్వారా నిందుతుడికి సంబంధించిన వివరాలు బయటకు వస్తుంటే వైసిపి శ్రేణులు విస్తు పోతున్నారు.