తెలంగాణాలో ఎన్నికలు షురూ అయ్యాయి. ఇప్పటికే ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించి ఎన్నికల వేడిని రాజేశారు. ఇక అన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారు చేయడంలో ముందు వరుసలో ఉన్నాయి. బిజెపి పార్టీ కూడా ఎన్నికల గోదాలో తనదైన ఎత్తులతో ముందుకు వెళ్లడానికి ప్రణాళికలు రచిస్తోంది.

ఆధ్యాత్మిక వేత్తగా రెండు తెలుగు రాష్ట్రాలలో పేరున్న స్వామి పరిపూర్ణానంద స్వామిని బిజెపి పార్టీలో చేర్చుకొని తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి బిజెపి సిద్ధంగా ఉంది. కానీ స్వామి గారికి ఇక్కడ రాజకీయాలు తెలియనివి కాదు. హిందుత్వ సెంటిమెంట్ తో పరిపూర్ణానంద స్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ముఖ్యమంత్రి అవ్వలేనని, తెలంగాణాలో బిజెపికి అంత సీన్ లేదన్న సంగతి స్వామికి తెలిసిందే.

ఇక పరిపూర్ణానంద స్వామి ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలసి వచ్చి, ఎన్నికలలో తాను రెండు రాష్ట్రాలకు సంబంధించి బిజెపి తరుపున ప్రచారం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ ఎన్నికల తరువాత తనను బిజెపి పార్టీ వాడుకొని పక్కన పెట్టకుండా రాజ్యసభ సీటు కేటాయించి, కేంద్ర రాజకీయాలలో తనకు ప్రత్యేకమైన స్థానం కల్పించాలని అడిగినట్లు బోగట్టా. దీనిపై ఇంకా అమిత్ షా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, ఈ బుధవారం అమిత్ షా హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఏనిర్ణయం తీసుకుంటాడని దాని మీద పరిపూర్ణానంద స్వామి భవిష్యత్ తేలనుంది.