జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని వాటిని పట్టించుకోనన్న పవన్.. తాను కులాన్ని నమ్ముకుని రాజకీయాలలోకి రాలేదన్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఏపీ ప్రతిపక్షనేత జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు పవన్. జగన్ తనకు శత్రువు కాదన్న ఆయన.. ఆ మాటకు వస్తే తనకు అసలు శత్రువులే లేరన్నారు. 2014 ఎన్నికలలో అనుభవం ఉందన్న కారణంతో ఆనాడు చంద్రబాబుకు మద్దతు ఇచ్చానన్నారు. కానీ టీడీపీ వారు తప్పులు చేస్తూ ఉంటె తాను ఊరుకోనన్నారు. తాను ఎన్నో కష్టాలలో ఉన్నపుడు జనసేన పార్టీని పెట్టానన్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్.. జగన్ ను ఉద్దేశించన్న ఈ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భవిషత్తులో వైసీపీ, జనసేన పొత్తు ఉండవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.