ఈ మధ్య కాలంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ సభ పెట్టినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం తన జీవితాన్నే త్యాగం చేసి మీ కోసం కష్టపడుతున్నాను అన్నట్లు మాట్లాడారు. నాపై కేంద్రం కుట్ర చేస్తుందని కేసులు బనాయించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని చంద్రబాబు ఆవేదన వెళ్లబుచ్చారు. ఇంకా మాట్లాడుతూ తమ్ముళ్లు నాపై ఏదైనా కుట్ర చేయాలనీ చూస్తే ఐదు కోట్ల మంది ప్రజలు తనకు వలయంలా నుంచొని తనను కాపాడుకోవాలని పలు సంచార్బాలలో చంద్రబాబు సూచించారు.

ఇక నిన్న చింతలపూడిలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ సభికుల ఉత్సాహం చూస్తుంటే తనకు దైర్యం వస్తుందని, కొంత మంది అధికారుల వల్ల గాని, నాయకుల వల్ల     గాని చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయని, వాటిని సరిచేసుకుంటూ నీతివంతమైన పాలన అందిస్తామని చంద్రబాబు తెలియచేసారు. అంటే ఇప్పటి వరకు ఎందుకు దైర్యం కోల్పిపోయారో, ఇప్పుడు ఎందుకు దైర్యం తెచ్చుకున్నారో అంతు చిక్కడం లేదు.

చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వేరు కుంపటి పెట్టిన తరువాత చంద్రబాబు నాయుడు కొంత అసహనం వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నా, పవన్ కళ్యాణ్ నాలుగు సంవత్సరాలు నాతో నడిచి ఈరోజు నన్నే విమర్శిస్తాడా అని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఆవేదన అంతటికి కారణం గోదావరి జిల్లాలో ఉన్న కాపు ఓట్ బ్యాంకు ఎక్కడ చీలి జగన్ కు ఎక్కడ లబ్ది చేకూరుతుందో అన్న భయం. కానీ సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది సెలెబ్రెటీలు పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపగా, పవన్ మాత్రం తన పుట్టిన రోజు వేడుకకు సంబంధించి ఒక నోట్ రిలీజ్ చేస్తూ అందులో ప్రత్యేకంగా రామోజీరావు, చంద్రబాబు, లోకేష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పేలా ఆ నోట్ లో ఉండటంతో పవన్ కళ్యాణ్ పై మరో సారి అనుమానాలు బలపడ్డాయి.

Pawan Kalyan

చంద్రబాబు నాయుడు గతంలో ఒకసారి చెబుతూ పవన్ కళ్యాణ్ ఎప్పటికి మనవాడే అని పవన్ కళ్యాణ్ పై ఆచితూచి స్పందించాలని పార్టీ నాయకులకు తెలియచేయడం చూసే ఉంటారు. మరో సారి 2019 ఎన్నికలలో కలసి పోటీ చేసేలా రామోజీరావు ద్వారా మధ్యవర్తిత్వం జరిగిందని అందులో భాగంగానే నోట్ లో ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా లేకుండా చంద్రబాబు, లోకేష్ లను హైలెట్ చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలపడంతోనే చంద్రబాబు నిన్నటి సభలో నాకు దైర్యం వచ్చిందని పవన్ కల్యాణ నాతోనే వచ్చే ఎన్నికలలో ప్రయాణిస్తాడని బావించరా  అన్నది ఆలోచించవలసిన విషయం.