పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడ నుంచి పోటీ చేస్తాడు అనేదానిపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. గతంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లి తాను అక్కడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నానని చెప్పి అక్కడ ఉన్న జన సైనికులను ఉత్సాహపరిచేలా చేసారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలి అనుకునేది మరో రెండు నెలలో నిర్ణయం తీసుకుంటానని జనవరి, ఫిబ్రవరి మాసంలో దీనిపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తానని అన్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో పోరాట యాత్రను కొనసాగిస్తున్నారు. తన పోరాట యాత్రలో భాగంగా వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ జనసేన పార్టీని వైఎస్ జగన్ గుర్తించనంత మాత్రాన తమకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని. తాను ఒక్క పిలుపునిస్తే లక్షలాదిగా జనం తరలివచ్చారని, జనసేనకు ప్రజల అండ స్పష్టంగా ఉందని తెలియచేసారు.