పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించి, ఎన్నికల బరిలో నిలపనునట్లు ప్రకటించాడు. కానీ కట్ చేస్తే కొన్ని రోజుల తరువాత జనసేన పార్టీ ఎన్నికలలో పోటీ చేయడం లేదని, తెలుగుదేశం, బిజెపి పార్టీలకు మద్దతుగా ప్రచారం చేస్తుందని మాత్రమే చెప్పారు. దానికి కారణాలు చెబుతూ సీనియర్ నాయకుడు, తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను పాలించిన ముఖ్యమంత్రి అయితేనే కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడని అందుకే అందరూ తెలుగుదేశం – బిజెపి పార్టీలకు ఓటు వేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేసాడు. పవన్ కళ్యాణ్ ప్రచారంతో తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలో కాపు ఓటు బ్యాంకు కలసి వచ్చి ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రానికి ప్రమాణస్వీకారం చేసారు.

నాలుగు సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ – తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి వచ్చిన పొరపొచ్చలతో విడిపోయి ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. 2014 ఎన్నికల ముందు జరిగిన సంఘటనలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు నచ్చ చెప్పడం వలనే తాను ఎన్నికలలో పోటీచేయలేదని తెలియచేసాడు. జనసేన పార్టీ ఎన్నికల బరిలో ఉంటె ఓట్లు చీలే ప్రమాదముందని నా దగ్గరకు వచ్చి అడిగాడని విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆ మరుసటి రోజే పవన్ కళ్యాణ్ పార్టీని తెలుగుదేశం పార్టీకి బేరం పెట్టాడని పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయని, అలా రావడానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా అని పవన్ ప్రశ్నించారు. మీడియాకు లీకులిచ్చిన చంద్రబాబు నాయుడుని మీకు విలువలు లేవా? పద్ధతి లేదా అని నిలదీయాలనుకున్నానని, కానీ పెద్ద మనిషి అన్న గౌరవంతో వదిలేసానని, తరువాత కొన్ని రోజులకి వెతుకుంటూ నా ఇంటికి వచ్చి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని కోరారని పవన్ తెలియచేసాడు. అందుకే తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చానని, ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతిపై మాట్లాడుతుంటే వారికి నచ్చడం లేదని, తిరిగి నాపై దాడి చేస్తున్నారని తెలియచేసారు.

పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో ఉనన్నీ రోజులు పవన్ కళ్యాణ్ మంచోడిలా చూసిన తెలుగుదేశం నాయకులకు ఈరోజు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే సరికి పవన్ రాజకీయాలకు పనికిరాడని అది అసలు పార్టీనే కాదని ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేయడం రోజు గమనిస్తూనే ఉన్నాం. ఈ పరిణామాలతో కలత చెందిన పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అన్ని స్థానాలలో పోటీ చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రాకుండా చూస్తానని తన ప్రసంగాలలో తెలియచేస్తున్నాడు.

Tags : Pawan kalyan, Janasena, Chandrababu Naidu, Telugudesam, 2014 Elections