తాను కులాన్ని నమ్ముకుని రాజకీయాలలోకి రాలేదని.. కాపులకు, బీసీలకు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడేనని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజాపోరాట యాత్రలో భాగంగా నర్సాపురంలో ప్రసంగించిన పవన్… టీడీపీ పాలనలో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ అన్ని అవినీతిమయంగా మారాయని ధ్వజమెత్తారు. అసలు చంద్రబాబు అనుభవం పశ్చిమ గోదావరి జిల్లాకు ఏమాత్రం పనికిరాలేదన్న పవన్… ఈ జిల్లాలో టీడీపీ పదిహేను సీట్లు గెలవకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారా? అని ధ్వజమెత్తారు. అలానే లోకేష్ మంత్రి అయ్యి తన నెత్తిన ఎక్కేవాడా? అని పవన్ మండిపడ్డారు. అసలు ఈ జిల్లాకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో టీడీపీ చెప్పాలన్న ఆయన.. మహిళా అధికారుల మీద దాడి చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించారు.