వైసిపి అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర చివరి దశకు చేరుకుంది. మరొక నెలరోజులలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగియనుంది. ఇప్పటికే పాదయాత్ర శ్రీకాకుళంలో మొదలు కావలసి ఉండగా, వైఎస్ జగన్ పై జరిగిన కత్తి దాడితో పాదయాత్రను కొద్ది రోజులుగా నిలిపివేయడంతో ఆలస్యమవుతుంది. ఇక వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విపక్ష నేత జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్ల మీద తిరుగుతుంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఎటువంటి నమ్మకం ఉంటుందని పవన్ ప్రశ్నించారు.

సూరంపాలెంలో దళిత భూములలో మట్టి తవ్వుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, అడ్డగోలుగా మట్టి తవ్వుకుంటుంటే చినరాజప్ప, యనమల ఏమి చేస్తున్నారని, మట్టి తవ్వకాలపై వైఎస్ జగన్ ప్రశ్నించకపోవడం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం, మంత్రులు, విపక్ష నేతలు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని, వీరంతా త్వరలో టపాకాయల్లా పేలిపోతారని పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు.