తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ప్రకటన చేశారు.తెలంగాణలో ఎన్నికలపై జనసేన అభిప్రాయం చెప్పాలని కార్యకర్తలు, జనసైనికులే కాకుండా పోటీలో ఉన్న పలువురు అభ్యర్థులు కూడా కోరుతున్నారని పేర్కొన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో 5వ తేదీన చెబుతానని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. సోమవారం రాత్రి ట్విట్టర్లో ఈ ట్విట్ చేసారు. తెలంగాణలో బలమైన పాత్ర పోషించినపుడే జనసేన అక్కడ పోటీ చేస్తుందన్న పవన్.. ముందస్తు ఎన్నికలు రావడం వల్ల పోటీ చేయలేకపోయామని అన్నారు.