పవన్ కళ్యాణ్ తన అన్న ప్రజారాజ్యం హోల్ సెల్ గా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తరువాత కొన్నాళ్ళు స్థబ్దుగా ఉండి ఇప్పుడు తిరిగి జనసేన పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కోసమని పార్టీ పెట్టి అందర్నీ ప్రశ్నించే పనిలో బిజీగా ఉన్నాడని జనసేన కార్యకర్తలు చెబుతుంటే, ప్రజలకు మాత్రం పవన్ కొందరినే ప్రశ్నిస్తున్నట్లు కనపడుతుంది.

పవన్ కళ్యాణ్ ఒక మీటింగులో మాట్లాడుతూ తాను రాజకీయాలలోకి రావాలని 7వ  తరగతిలోనే డిసైడ్ అయ్యానని చెప్పి కంగుతినిపించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ఇంకా నయం పవన్ కళ్యాణ్ గర్భంలో ఉండగా 7వ నెలలోనే పార్టీ పెట్టాలని డిసైడ్ అవ్వలేదు కదా అంటూ జోకులు పేలుస్తున్నారు.

రాజకీయాలలోకి వచ్చిన తరువాత మనం మాట్లాడే ప్రతి ఒక్కటి ప్రజలు కన్నా, ఈరోజు సోషల్ మీడియా ఎక్కువ గమనిస్తుంది. ఒక చిన్న తప్పు మాట్లాడినా సోషల్ మీడియా వేదికగా పక్క పార్టీలు చీల్చి చెండాడటానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటిది 7వ తరగతిలోనే పవన్ రాజకీయాలలోకి రావాలి అనుకున్నారు అంటే, ఎన్టీఆర్ కన్నా ముందే తాను పార్టీ పెట్టి ప్రజా పక్షాన చేయాలనీ పూనుకున్నాడా? అని పవన్ చెప్పదలచుకున్నాడని అనుకోవాలా?