పవన్ కళ్యాణ్ దసరా ఉత్సవాలు మొదలవనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దుర్గమ్మ దీక్షకు దిగనున్నారు. ఉత్సవాలు జరిగే అన్ని రోజులు ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకొని పట్టిసీమ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దీక్ష ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఈ దీక్ష బుధవారం మొదలై దసరా పండుగ రోజు వరకు కొనసాగనుందని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ కు దీక్షలు చేసే అలవాటుందని, తాను చేసే దీక్షలు ఎంతో నిష్ఠతో ఉంటాయని, గతంలో చాతుర్మాస దీక్ష చేసే సమయంలో పవన్ 45 రోజుల పాటు ఆహారం తీసుకోవడం మానేసేవారట. మరి పవన్ చేపట్టిన 15వ తారీకు కవాతులో ఏమైనా మార్పులు ఉంటాయా లేక, దీక్ష మధ్యలో వచ్చి కవాతు చేసి మరల దీక్షలో కూర్చుంటారా అనేది తెలియాల్సి ఉంది.