పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వేదికగా 2019 ఎన్నికలలో రాజకీయాలు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ తన కుటుంబంతో పాటు, ఆఫీస్, చివరకు తన ఓటర్ కార్డుని కూడా మార్చుకొని 2019 ఎన్నికలు ఎంత సీరియస్ గా తీసుకున్నానో అని చెప్పకనే చెబుతున్నాడు.

Pawan voter card

ఇక పవన్ కళ్యాణ్ ఏలూరు కేంద్రంగా లోక ఇంటిని అద్దెకు తీసుకున్న విషయం తెలిసినదే. పవన్ కళ్యాణ్ ఇంటిని అద్దెకు తీసుకున్న తరువాత అక్కడ ఓటర్ గా నమోదు చేసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఆ ప్రాంతం నుంచి ఓటర్ కార్డు వచ్చేసింది, హౌస్ నెంబర్ 27-21-19 గా దరఖాస్తులో తన ఇంటి అడ్రస్ నమోదైనది. పవన్ కళ్యాణ్ గతంలోనే చెబుతూ తమ పూర్వికులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారని, తాను కూడా వచ్చే ఎన్నికలలో ఈ జిల్లా నుంచే రాజకీయాలలోకి అరగేంట్రం చేస్తానని చెప్పినట్లుగానే ఏలూరు కేంద్రంగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.