రాజమహేంద్ర వరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 15 న చేపట్టిన కవాతులో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తుంది. మొదట విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం కాటన్ విగ్రహం వరకు వేలాది జనసైనికులతో కవాతు చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం పోలవరంలో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన నేతలతో చర్చించి కాటన్ బ్యారేజిపై పిచ్చికలంక నుంచి కాటన్ విగ్రహం వరకు కవాతు చేయాలని నిర్ణయించారు.

ఆరోజు ఉదయం పవన్ కళ్యాణ్ తాడేపల్లి గూడెం నుంచి పిచ్చుకలంక చేరుకుంటారని, అక్కడ నుంచి కాటన్ విగ్రహం వరకు కవాతు నిర్వహిస్తారని తెలియచేసారు. ధవళేశ్వరం కాటన్ విగ్రహం వద్ద పవన్ కళ్యాణ్ బారి బహిరంగ సభ నిర్వహిస్తారని, విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు 4.8 కిమీ మేర కవాతు జరిగే ప్రాంతంలో మధ్య మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కవాతు 15వ తారీకు మధ్యాహ్నం 3 గంటలకు మొదలవనుంది.

కవాతు అనంతరం పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకుంటారని, జిల్లాలో మిగతా పోరాట యాత్రలు తరువాత ప్రకటించనున్నారని తెలియచేసారు. బ్యారేజి భద్రత, జనాన్ని అదుపు చేయడం తదితర కారణాలతో పిచ్చుకలంక నుంచి మాత్రమే కవాతు నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది.