జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై ఇక నుంచి దాడి ఇంకా పెంచాలని టీడీపీ నిర్ణయించింది. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ రెండు పార్టీలు కలిసి కట్టుగా ఉండడంతో ఒకరిపై మరొకరు ఏవిధమైన విమర్శలు చేసుకోలేదు. గత నాలుగు సంవత్సరాల నుండి పవన్‌కల్యాణ్ ప్రతిపక్షనేత జగన్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. కానీ నాలుగు నెలల కాలం నుండి పవన్ కళ్యాణ్.. సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతి పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పవన్ చేస్తున్న ఈ ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన టీడీపీ.. ఇకపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఏ స్థాయి విమర్శలు చేస్తున్నామో అదే స్థాయిలో జనసేనపై విరుచుకుపడాలని అధిష్ఠానం నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేషులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఉండడంతో ఇక దాడి ఉదృతం చేయాలనీ నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ.

Tags: PawanKalyan, Chandrababu Naidu, Janasena, Tdp, Nara Lokesh