కర్నూల్ జిల్లాలో పేలుడు జరిగిన ప్రాంతానికి ఈరోజు పవన్ కళ్యాణ్ వెళ్లి సందర్శించారు. క్వారీలో జరిగిన అక్రమ పేలుళ్ల వల్ల అన్యాయంగా 11 మంది చనిపోయారు. దీనిపై ఆ ప్రాంతాన్ని సందర్శించిన తరువాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో రియల్ గవర్నెన్సీ చేస్తున్నామని చెప్పే ముఖ్యమంత్రి గారికి అక్రమంగా మైనింగ్ కనపడ లేదా అని ప్రశ్నించారు. అసలు అక్రమ మైనింగ్ ఎలా జరుగుతుందని ఎక్కడో వీధిలో లైటు వెలగకపోతే తనకు తెలిసిపోతుందని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రికి అక్రమ మైనింగ్ గురించి తెలియకపోవడం ఏమిటని, పదకొండు మంది అనాయాయంగా చనిపోవడం ఇది అంత తెలుగుదేశం పార్టీ వైఫల్యమని పవన్ కల్యాణ అన్నారు. ఆ ప్రాంతంలో పడిన గొయ్యిని చూస్తే అక్కడ పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందనేది తెలుస్తుందని, దీనికి తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ అన్నారు.