తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈరోజు పారిశుధ్య కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసారు. “రెల్లి” కులస్తులకు తాను అండగా ఉంటానని, తాను ఈరోజు నుంచి “రెల్లి” కులస్థుడునని, ఆ విషయం తాను గర్వంగా చెప్పుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. అన్ని కులాల కారి మల మూత్రాలు తీసే మీరు ఉన్నత కులం వారని, అలా చేయాలంటే ఎంతో పెద్ద మనస్సు ఉండాలని పవన్ అన్నారు.

“రెల్లి” కులం వారికి తాను, తన పార్టీ అండగా ఉండకపోతే తాను పార్టీ పెట్టి ఏమి ప్రయోజనమని ఎవరైనా “ఇల్లు అద్దెకు ఇస్తారా అని అడిగే దౌర్బాగ్యం మీకు ఏమిటని, వేరే వాళ్ళు వచ్చి మిమల్ని ఇల్లు అద్దెకు అడగాలి. అలాంటి జీవితాన్ని తాను మీకు ఇస్తానని, ఈరోజు నుంచి మీ గొంతు నాది, మీరు బాధపడకండి మీకు నేను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.