జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అభిమానులు ద్రిగ్బంధించారు, కర్నూల్ జిల్లాలోని హత్థిబెళగల్ లోని క్వారీ ప్రమాద బాధితులను సందర్శించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా అభిమానులు అడ్డుపడ్డారు. బారి సంఖ్యలో వచ్చిన పవన్ అభిమానులను నియంత్రించలేక పోలీసులు చాల కష్టపడ్డారు. పేలుడు ధాటికి పగుళ్లు ఏర్పడిన ఇల్లు చూడాలనుకుని ఆ ప్రాంతానికి వచ్చిన పవన్, ఆ ప్రమాద ప్రాంతం మొత్తం చూడాలనుకున్నారు. కానీ అభిమానులను పోలీసులు నియంత్రిచలేకపోవడంతో పవన్ ఆ ప్రాంతం మొత్తాన్ని సందర్శించకుండానే వెనుదిరిగారు.