జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు ఆయన మాతృమూర్తి అంంజనాదేవీ నాలుగు లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. పార్టీ ఆఫీస్ కి వచ్చిన ఆమె.. ఈ మేరకు చెక్కును పవన్ కళ్యాణ్ కు అందచేశారు. ఈ సందర్భంగా అంజనీదేవి మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమతో కూడుకున్నదని, అంటువంటి వారి కుటుంబాలకు అండగా నిలవాలని పవన్ కి చెప్పానన్నారు. తన భర్త వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్ల తనకు పెన్షన్ వస్తోందని.. ఆ పెన్షన్ మొత్తాన్నే జనసేన పార్టీకి విరాళంగా అందచేసినట్లు తెలిపారు. ఈ సందర్భముగా పవన్ కళ్యాణ్ తన తల్లి కాళ్లకు నమస్కారం చేసారు. పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ ఇంకా ఇతర నేతలను తన తల్లికి పరిచయం చేసారు.