ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్ని వైపులా నుంచి సర్వేలు ఘంటా పదంగా చెబుతుంటే, కేసీఆర్ మాత్రం తనకు కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నాడు. ఇందులో భాగంగానే ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని… రేవంత్ రెడ్డిపై పోటీకి నిలబెట్టి పోరుని రసవత్తరం చేసారు.

రేవంత్ రెడ్డి ఎంత సేపటికి మాటలు చెప్పడమే తప్ప, నియోజకవర్గానికి ఏమి చేయలేదని తెలుస్తుంది. మరోసారి తన మాటల గారడితో ప్రజలను మోసం చేసి మరోసారి నెగ్గుకు రావాలని చూస్తున్నాడు. కానీ కేసీఆర్ గత సంవత్సర కాలం నుంచే రేవంత్ రెడ్డిపై ఫోకస్ పెట్టి కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ బలపడేందుకు కృషి చేస్తున్నాడు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రేవంత్ రెడ్డిలో టెన్షన్ పెరిగిపోవడంతో ఓటమి భయంతోనే నిన్న కొడంగల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఒకవైపున కోరుతూ, మరోవైపున ఈరోజు కేసీఆర్ నిర్వహించనున్న కొడంగల్ బహిరంగ సభను అడ్డుకోవాలని పిలుపునివ్వడంతో, అర్ధరాత్రి పోలీసులు వచ్చి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి వేరే ప్రాంతానికి తరలించారు.

రేవంత్ రెడ్డికి గెలుపై ధీమా లేకనే కేసీఆర్ సభను అడ్డుకుంటానని, ఎన్నిక వాయిదా వేయాలని లాంటి ప్రకటనలు చేస్తున్నాడని, కొడంగల్ లో టెన్షన్ వాతావరణం కల్పించి ప్రజల సింపతిని పొందాలని చూస్తున్నాడని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డిని మాత్రం తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గట్టిగానే టార్గెట్ చేసి ఎలాగైనా అసెంబ్లీ గేటు తొక్కనియ్యకుండా చేయాలని శబధం చేసుకున్నట్లు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటేనే తెలుస్తుంది. ఎన్నికలలో మరోసారి రేవంత్ రెడ్డి గెలిచి కేసీఆర్ కు కొరకురాని కొయ్యగా మారతాడా లేక కేసీఆర్ పంతం నెగ్గించుకొని రేవంత్ రెడ్డిని ప్రజలు చేత తిరస్కరించేలా చేస్తాడో చూడాలి.

రేవంత్ రెడ్డి పొలిటికల్ ప్రొఫైల్      కొడంగల్ ఎన్నికల ఫలితాలు