ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, కొంత మంది వైసిపి అభిమానులు సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటూ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను వెలికితీయడంలో ముందు వరుసలో ఉంటున్నారు. అలాంటి వారు ఏదో ఒకచోట, ఎవరో ఒకరని విమర్శిస్తూ ఎక్కడ దొరుకుతారా అని ప్రభుత్వ పెద్దలు కాచుకొని కూర్చున్నారు. ఇందులో భాగంగానే గత రెండు రోజుల క్రితం వైసిపి అదినేత జోగి రమేష్ ను గుంటూరులో రోజంతా ఎంక్వయిరీ పేరుతో పిలిచి భయపెట్టాలని చూసారు.

వైసిపి నేతల సంగతి పక్కన పెడితే గత 10 రోజుల క్రితం వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నంకు సంబంధించి తెలుగుదేశం ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైసిపి అధినేత వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై సంచలన ఆరోపణలు చేస్తూ వారిద్దరే వైఎస్ జగన్ ను చంపడానికి కుట్ర చేసారని మీడియా ముఖంగా ఆరోపించారు.

దీనిపై ఆగ్రహించిన కొంత మంది వైసిపి నెటిజన్లు బాబు రాజేంద్ర ప్రసాద్ పై విమర్శలు చేస్తూ, రాజేంద్ర ప్రసాద్ కూతురు ఫారిన్ ట్రిప్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అప్పట్లో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా షేర్స్, లైక్స్ రావడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ తన కుటుంబంపై పెట్టిన పోస్టులకు ఆగ్రహం చెందుతూ తనపైన, తన కూతురుపైన పోస్టులు పెట్టిన 18 మందిపై కృష్ణ జిల్లా ఉయ్యురు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. దీనిపై వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని పట్టుకొనే పనిలో నిమగణమయ్యారు.

చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు ఎవరు పెట్టినా ఇలా అరెస్టుల పేరుతో ఇబ్బంది పెట్టడంతో వైసిపి నెటిజన్లకు అన్ని వర్గాల నుంచి సపోర్ట్ అందుతుంది. మేము చేస్తే సంసారం, పక్క వాడు చేస్తే వ్యభిచారం అన్న రీతిలో ముందుకు వెళ్తుంటే పార్టీలకు సంబంధం లేని సామాన్య జనం కూడా స్పందిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం.