సెప్టెంబర్ 2వ తేదీన హైదరాబాద్ కొంగరకలాన్ లో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభకు ఖమ్మం జిల్లా నుంచి 2 వేల ట్రాక్టర్లు బయలుదేరాయి. పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కలిసి 2000 ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. శనివారం సాయంత్రం కొంగరకలాన్ సభా వేదిక వద్దకు ఈ ట్రాక్టర్లు చేరుతాయని తెలియజేసారు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ 2000 ట్రాక్టర్లు ద్వారా సుమారు 10,000 మంది రైతన్నలు, స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు సభకు చేరుకోనున్నారు.

trs Khammam