చంద్రబాబు నాయుడుపై బిజెపి నేత పురందేశ్వరి వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. సీఎం చంద్రబాబు ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకించలేదని పురందేశ్వరి తెలియచేసారు. హోదా కంటే ప్యాకేజి గొప్ప అని చంద్రబాబు అంగీకరించిన మాట వాస్తవమని, మరల ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్యాకేజి కంటే హోదా ముఖ్యమని అనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.  రాజకీయ లబ్ది కోసం టిడిపి తప్పుడు ప్రచారం చేస్తుందని, తమ వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి బిజెపిపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నాలుగేళ్ళ కాలంలో ఏమి అడగకుండా ఇప్పుడు అడగటం ఏమిటని పురందేశ్వరి అన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఎన్నడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేసారు.