లగడపాటి రాజగోపాల్ సర్వే అట్టర్ ప్లాప్ అవ్వడంతో లగడపాటిని నమ్ముకుని ఎంతో మంది బెట్టింగులు పెట్టిన వారు కోట్లలో నష్టాలు చవిచూశారు. లగడపాటి సర్వేలలో ఉన్న పదును చూసి అన్ని సర్వేలు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెబితే… తెలంగాణ, ఆంధ్రప్రాంతానికి చెందిన బెట్టింగ్ రాయుళ్లు మాత్రం లగడపాటి సర్వేను నమ్మి భారీగా దెబ్బతిన్నారు. ఎన్నికల ఫలితాల వచ్చిన నాటి నుంచి లగడపాటి మీడియాకు ముఖం చాటేస్తూ తన సర్వే గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు.

ఇక వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లగడపాటి సర్వేను నమ్మే దాఖలాలు కనపడటం లేదు. దీనితో లగడపాటి సర్వేతో తెలంగాణ ఎన్నికల ప్రజలపై ప్రభావం చూపించాలని చూసిన కూటమి నాయకులకు మింగుడుపడని అంశంగా మారింది. దీనితో ఇప్పుడు లగడపాటిది ఏమి తప్పు లేదని లగడపాటి ముందుగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణాలో ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు 90 సీట్లు వస్తాయని సెలవిచ్చాడని, లగడపాటి చెప్పినట్లు 88 సీట్లు టీఆర్ఎస్ పార్టీ సాధించిందని అందుకే అతను చేసిన సర్వే కరెక్ట్ అని సర్ది చెప్పే ప్రయత్నం ఏబీఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులలో సెలవిచ్చారు.

ఎప్పుడూ లగడపాటి ఎన్నికలకు ముందుగా సర్వే రిలీజ్ చేయని వాడు తెలంగాణ ఎన్నికల సందర్భంగా మీడియా ముందుకు వచ్చి సర్వే విడుదల చేసాడు. పచ్చ మీడియా చానెల్స్ లో పదే పదే ప్రసారం చేస్తూ టీఆర్ఎస్ పార్టీని బద్నామ్ చేయాలని చూసిన వారికి ఇప్పుడు మింగుడు పడటం లేదు. ఇక లగడపాటి సర్వేతో వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ప్రజల మీద ప్రభావం చూపించేలా ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీ ప్రభంజనమని మరోసారి చెప్పించే ప్రయత్నం చేయాలనుకున్న వారికి ఆదిలో కంగుతినడంతో వైసిపి శ్రేణులు ఆనంద పడుతున్నారు. రాధాకృష్ణ ఎంతలా తన కొత్త పలుకుల పేరుతో ఎన్ని చిలక పలుకులు పలికినా ఇక ప్రజలు లగడపాటిని నమ్మే పరిస్థితి లేదని తెలుస్తుంది.

Telangana State 2018 Election Results